ఈనాడు ఆర్టికల్

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుదిల్లీ: బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు… విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్‌ ప్రముఖులను ఒకే చోటకు తీసుకురానుంది. డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) మూడు రోజుల పాటు దిల్లీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి 650 మందికిపైగా ముఖ్యులు తరలివస్తున్నారు. ‘‘ప్రపంచ సవాళ్లు-భారతీయ దృక్కోణాలు’’ ముఖ్యాంశంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా భారత్‌లోని ఆర్థిక సంస్కరణల గురించి ఇతర దేశాల వాణిజ్య ప్రముఖులకు నేరుగా తెలియజేసే అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.